హనీ ట్రాప్ వలలో చిక్కిన పాల డైరీ యజమాని ఎవరు ?

* ఒక డాక్టర్ ఐదు లక్షలు ఎందుకు చెల్లించుకున్నాడు?

సాక్షి డిజిటల్ న్యూస్ అనంతపురం మే 4 అనంతపురం జిల్లా ఇన్చార్జ్: హనీ ట్రాప్ వలలో చిక్కిన ఎంతోమంది లోలోపలే బాధపడుతూ పోగొట్టుకున్న డబ్బు ఎలాగూ తిరిగి రాదు. పరువు ప్రతిష్టలు మాత్రం పోకూడదు అన్న బాధతో మదన పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఎంతోమంది మోసపోయిన వాళ్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మరి కొంతమంది తమకు జరిగిన అన్యాయం గురించి తమకు తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకుంటున్నారు. నగరంలోని ఒక పాల డైరీకి చెందిన వ్యక్తి హనీ ట్రాప్ ముఠా సభ్యులకు దాదాపు 25 లక్షలు చెల్లించుకున్నట్టు సమాచారం. అలాగే నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రాక్టీసు చేస్తున్న ఒక డాక్టరు ఐదు లక్షలు ఈ హనీ ట్రాప్ ముఠాకు ఎందుకు చెల్లించారు. ప్రస్తుతం నందు టైమ్స్ ఈ అంశంపైనే పని చేస్తూ పూర్తి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తోంది. మరింత సమాచారం మరియు ఆధారాలతో త్వరలో మీ ముందుకు వస్తాం. హనీ ట్రాప్ ముఠా సభ్యులు గురించి అలాగే వారి బారిన పడి ఆర్థికంగా నష్టపోయి లోలోపలే మదన పడుతున్న వారి గురించి ఎప్పటికప్పుడు మీకు సాక్షి డిజిటల్ న్యూస్ అప్డేట్స్ ఇస్తుంది. నిజాలు నిర్భయంగా రాసేందుకు భయపడని పత్రిక సాక్షి డిజిటల్ న్యూస్ బాధితులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించండి మీ పేరు మీ వివరాలు గోప్యంగా ఉంచి, ముఠా సభ్యులు చేసిన అరాచకాలను బయటపెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు 9492789494 అనంతపురం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *