సాక్షి డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా: 3/9/2026 సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మడికొండ పవన్ కుమార్: రాజకీయ జెండాల మధ్య అంబేద్కర్ ఆశయాలు మునిగిపోతున్నాయా..? సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు ప్రజాస్వామ్యానికి పునాదులు వేసిన మహాను బావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ! కానీ నేడు ఆయన విగ్రహం చుట్టూ రాజకీయ జెండాలు పార్టీ రంగులు పెరిగిపోతుంటే అంబేద్కర్ ఆశయాలు మాత్రం రాజకీయాల మధ్య మునిగిపోతున్నాయని ఆవేదన కలుగుతుంది! అంబేద్కర్ ఏ ఒక్క పార్టీకి చెందినవారు కాదు.. ఆయన ఆశయాలు యావత్ భారతదేశానివి జెండాలు ఎగిరేయడం కంటే ఆయన చూపిన సమానత్వ మార్గంలో నడవడమే ఆ మహనీయుడికి నిజమైన గౌరవం గొప్ప నివాళి అంబేద్కర్ విగ్రహం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదు ఆయన దేశానికే చెందిన మహనీయుడు విగ్రహం చుట్టూ రాజకీయ పార్టీల జెండాలు పార్టీ రంగులు పెట్టి ఆయనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అంబేద్కర్ గారిని గౌరవించడం కాదు, అవమానించడమే అంబేద్కర్ విగ్రహాలను మాత్రం రాజకీయ రంగులతో కలిసితం చేయకండి అంబేద్కర్ యువజన సంఘం మరియు అంబేద్కర్ వాదులు.