స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వఅభ్యర్థి ఎవరైనా గెలుపుకు కృషి చేయండి

టిడిపి మండల మాజీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 రామకుప్పం రిపోర్టర్ జయరాం రెడ్డి చిత్తూరు జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతులు చేయాలని, తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామకుప్పం మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ ఆంజనేయ రెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం రామకుప్పం పట్టణంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద తెలుగుదేశం పార్టీ యూనిట్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రుల ఆశాజ్యోతి, కుప్పం ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో రామకుప్పం మండల కేంద్రంలో ఎవరూ ఊహించని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. ఈ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సి.విజయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు అల్లి శ్రీను, టీవీ రవి, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆదిల్ భాషా, ముఖ్య నేతలు సలాం సాబ్, నియూ సాబ్, మంజునాథ్, సుబ్రీ, చాంద్ బాషా, నీసార్, చలం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *