దళిత జర్నలిస్టుల సంఘం సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఏర్పాటు

* జిల్లా అధ్యక్షుడిగా రమణి అశోక్ ఏకగ్రీవ ఎన్నిక .
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబరు 03 అందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య) దళిత జర్నలిస్టుల సంఘం సంగారెడ్డి జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కాషాపొగు జాన్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రమణి అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శిగా జోగ్యల్ల రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, సీనియర్ జర్నలిస్టులు విలాస్, రాజు, అశోక్తో పాటు పలువురు పాత్రికేయ మిత్రులు, దళిత జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *