దివంగత నేత వై,ఎస్ కు నివాళులు

*సంక్షేమ పథకాలు పెట్టిన పేదల దేవుడు డా,వై,ఎస్
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు 13 డివిజన్ బాబు జగ్జీవన్ రామ్ జంక్షన్ లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి17 వ వర్ధంతి నిర్వహించారు. జన్ను అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ జన్ను పూర్ణ ప్రసన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా జన్ను అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పేదల కోసం అనేకమైన సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారు అందులో భాగంగా ఆరోగ్యశ్రీ , 108, 104, విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి పెట్టిన దేవుడన్నారు. ఈ కార్యక్రమంలో గణిపాక క్రాంతి, జన్ను సునీల్, జన్ను శ్రీనివాస్ రంజిత్, నూతన్ బాబు, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *