నేరేడుచర్లలో మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభింస్తున్న

మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 యారవ సురేష్ నెరేడుచెర్ల మండలం: మండలస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడలు ఆడుతున్న విద్యార్ధులుక్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకటరెడ్డి క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా వ్యక్తుల మధ్య స్నేహాన్ని, సామాజిక మందాలను బలంగా పెంపొందిస్తాయని మున్సిపల్ చైర్మన్ కొణతం వెంకటరెడ్డి అన్నారు. బుధవారం స్థాణిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. మైదానంలో కలిసి ఆడేటప్పుడు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ ఒకే జట్టుగా ఆడుతారని తెలిపారు. గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నట్లే ఓటమిని కూడా జీర్ణించుకొని ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు, ఎంఈవో బాలు నాయక్, పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు, పీడీలు ఏసుపాదం, యాదగిరి, శ్రీనివాస్, అశోక్, పీఈటీలు, ఉపాధ్యాయులు కట్టా శ్రీనివాస్ రెడ్డి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *