
సాక్షి డిజిటల్ న్యూస్ ఉరవకొండ సెప్టెంబర్ 3 అనంతపురం జిల్లా ఇన్చార్జ్ జనసేన పార్టీ అధ్యక్షులు అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉరవకొండ మండల కేంద్రంలో బుధవారం రోజున భారీ ఎత్తున జన్మదిన వేడుకలు ఇన్చార్జి గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
మొదటగా ఎమ్మార్వో కార్యాలయం నందు జనసేన సభ నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు కార్యకర్తలు భారీ కేక్ కటింగ్ జరపడం జరిగింది. ఉరవకొండ నియోజకవర్గం లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎమ్మార్వో కార్యాలయం నుంచి పోలిస్టేషన్ మీదుగా బస్టాండ్ మీదుగా బైపాస్ కనేకల్ క్రాస్ అయ్యప్ప స్వామి గుడి పాత ఊర్ టవర్ క్లాక్ కవిత హోటల్ సర్కిల్ మీదుగా రైట్ జనసేన మారుమోగింది. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 100 బైకులతో పైగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇన్చార్జి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మార్వో కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ప్రసంగం వినిపంచిన తర్వాత ,ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా బైకు ర్యాలీ ఈ కార్యక్రమాన్ని బారి ఎత్తున విజయవంతం చేసిన జనసేన కార్యకర్తలకు నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న స్థానిక ఎన్నికలకు జనసేన నాయకులు కార్యకర్తలు,సిద్ధమవ్వాలని జనసేన సత్తా నిరూపించాలని జనసేన సైనికులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్ర శేఖర్, వజ్రకరూరు కేశవ్, విడపనకళ్ గోపాల్, బెలుగుప్ప సుధీర్, మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ నాగరాజు, మండల నాయకులు మధు, మణి కుమార్, అనిల్, శివ, రాము, సాయి, ధనుంజయ, నీలకంఠ, రమణ, రవి నాయక్, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన మండల కన్వీనర్లు. మండల కమిటీ సభ్యులు. ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు వీర మహిళలు, యువత మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.