ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి: కాంగ్రెస్ నాయకులు
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 3 కామారెడ్డి పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ ఆదేశాల మేర. ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను, ఆయన ప్రజా సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని వారు పేర్కొన్నారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి కార్యక్రమాలను చేపట్టారని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేశారని నాయకులు గుర్తుచేశారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పేదల సంక్షేమానికి ఆయన అందించిన సేవలు నేటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయాయని అన్నారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. వైఎస్సార్ చూపిన ప్రజా సేవా మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికీ అండగా నిలవడం, ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, కామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజా గౌడ్ కౌన్సిలర్లు అంజద్, అన్వర్ అహ్మద్,లడ్డు,కన్నయ్య,పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మత్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుట్నాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాల్రాజ్ , జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పడిహార్ కిరణ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు సిరాజుద్దీన్ రామ్ కుమార్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి భరత్ టింకు జమీల్, మహేందర్ రెడ్డి, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్, ప్రవీణ్ రెడ్డి, నర్సింలు, భీమేష్ ఇసుక రాజు, రాకేష్ రెడ్డి, హనుమాండ్ల రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వార్డు నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొని మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *