రజక ఫెడరేషన్ చైర్మన్ దాసరిరాజు అజయ్ కుమార్ ని కలిసి మెమోరండం అందజేసిన టి ఆర్ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్: 03/09/2026 మండల్ స్టేషన్ ఘన్పూర్. జిల్లా జనగామ. రిపోర్టర్ కొలిపాక బీసీ శేఖర్. సెప్టెంబర్ 2026: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న రజక వృత్తిదారుల కోసం ఈరోజు రజక ఫెడరేషన్ చైర్మన్ దాసరిరాజు అజయ్ కుమార్ ని తన కార్యాలయంలో కలిసి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలని కోరుతూ మెమోరండం అందజేసిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర కో కన్వీనర్ పాతనబోయిన సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వైనాల లింగన్న, రాష్ట్ర నాయకులు వేములవాడ రాజేష్,రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బాచుపూర్ వెంకటయ్య, హైదరాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులు సిహెచ్ బాలకృష్ణ. చైర్మన్ డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్ స్పందిస్తూ రజక వృత్తిదారులు ఆందోళన చెందవద్దని విద్యుత్ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిన మా దృష్టికి తీసుకురావాలని హామీ ఇచ్చారు. ఎంత బిల్లు వచ్చిన ప్రభుత్వమే చెల్లిస్తుందని దీనిపై ఎలాంటి అపోహలు వద్దని వారన్నారు. గతంలో కనెక్షన్ తీసుకోని రజక వృత్తిదారుకు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు తీసుకుని కనెక్షన్ లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని అంతేకాకుండా రజక సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ కి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *