పేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్సార్

వైసీపీ నాయకులు నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి కొత్తపాలెంలో ఘనంగా మహానేత వైయస్సార్ వర్ధంతి కార్యక్రమం
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 3, కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్‌సీపీ నాయకుడు నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి అన్నారు. వైయస్సార్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని మండలంలోని కొత్తపాలెం గ్రామంలో బుధవారం ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైయస్సార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రవేశపెట్టి సామాన్యులకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు.రైతుల కోసం ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి కార్యక్రమాలను చేపట్టి వ్యవసాయ రంగానికి అండగా నిలిచారని హరిశ్చంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఉన్నత విద్యను పేదకుటుంబాల పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇళ్ల నిర్మాణానికి అన్ని వసతులను సమకూర్చారన్నారు.వైయస్సార్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన మహానేత వైయస్సార్‌ను ప్రజలు ఎప్పటికీమరచిపోలేరన్నారు. వర్ధంతి కార్యక్రమం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు వైయస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. “వైయస్సార్ అమర్ రహే.. జోహార్ వైయస్సార్” అంటూ చేసిన నినాదాలతో కొత్తపాలెం గ్రామంమార్మోగింది.కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *