పేదల విద్యా, వైద్యానికి వైఎస్సార్ పథకాలు అండ -వైసీపీ సీఈసీ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 గూడూరు రిపోర్టర్ చెన్నూరు మస్తాన్ పేద ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలనే సదుద్దేశంతో స్వర్గీయ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వైసీపీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ పథకాల ద్వారా ఎంతో మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామంలో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. తొలుత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని తెలిపారు. వైఎస్సార్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆయనను ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగిస్తున్న ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా గెలిపించాలని శ్యాంప్రసాద్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, రాజారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రాధారెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *