
సాక్షి డిజిటల్ న్యూస్, పులివెందుల, సెప్టెంబర్ :03(పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసుల అంజనేయులు) పులివెందుల టీడీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి , వేంపల్లె టీడీపీ ఇన్చార్జ్ అజ్జుగుట్టు రఘునాథరెడ్డి , మారెడ్డి రామ్‌రెడ్డి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మారెడ్డి లతరెడ్డిమాట్లాడుతూ,గ్రామీణ రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాల కల్పన, పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యాల విస్తరణతో పాటు పంచాయతీలను బలోపేతం చేస్తూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. అజ్జుగుట్టు రఘునాథరెడ్డి మాట్లాడుతూకూటమి ప్రభుత్వం పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ గారి సేవలు అభినందనీయమని అన్నారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భరత్ రెడ్డి, యువరాజ్, తదితరులు పాల్గొన్నారు…