
సాక్షి డిజిటల్ న్యూస్; 03 సెప్టెంబర్ 2026; ఎలిగేడు మండల రిపోర్టర్ కవ్వంపల్లి సుధీర్; ఎలిగేడు మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డ్ అందజేశారు సర్పంచ్ కప్పల ప్రవీణ్’ప్రజలకు ప్రభుత్వ సదుపాయాలు మరింత సులభంగా ఉండడానికి స్మార్ట్ రేషన్ కార్డ్ తప్పనిసరి అవసరం అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తామని సర్పంచ్ కప్పల ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు.