సాక్షి డిజిటల్ న్యూస్ 04.05.26 కొందుర్గ్: పర్వతాపూర్ గ్రామంలో ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలోభాగంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పేదవారికి గృహ నిర్మించి పేదోడి సొంతింటి కలను నిజం చేస్తున్న అత్యనత ప్రజాదరణ పథకం ఇది. అయితే మొదటి విడతలో మంజూరు కాబడ్డ అనేక వేల ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్రమంతట దాదాపు పూర్తి కాబడ్డాయి. అయితే ప్రస్తుతము కొందుర్గ్ మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న కాశ మంజుల ఆంజనేయులు కుమ్మరి పుష్పమ్మ ఆంజనేయులు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలలో స్థానిక మాజీ ఎంపీటీ సభ్యులు మంజుల మల్లేష్ గౌడ్ రిబ్బను కట్ చేసి గృహ ప్రవేశం చేశారు అనంతరం వారికి నూతన వస్త్రాలను అందజేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు మంజుల మల్లేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ బోయ అశోక్, వార్డ్ మెంబర్స్ డబ్బు రాకేష్, కర్రోల సరిత నర్సింలు, చందన అశోక్ గౌడ్, సురేష్ ఇంద్రమ్మ కమిటీ నెంబర్స్ గడ్డ నరసింహులు, శ్యాంసుందర్, నగరం మల్లేష్ గౌడ్, టిప్పర్ రవి, కాశ రాములు, డబ్బు నర్సింలు, చిన్న బాలి రమేష్, పత్తి శ్రీశైలం, డబ్బు యాదయ్య, సంఘాల నరసింహులు, టేకులపల్లి వెంకటయ్య, పాల్గొన్నారు.