సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ 4 మే 2026: పత్రిక స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి నిజాన్ని నిర్భయంగా రాయడం , అన్యాయాన్ని ఎత్తిచూపడం ప్రజల గొంతుకగా నిలవడం. పాత్రికేయుల లక్ష్యం. గన్ను కన్నా కలం గొప్పది అన్నారు. ఆ కలం తోనే నిజాన్ని నిర్భయంగా రాస్తున్న పత్రికేయులపై జరిగే దాడులకు ఎవరు బాధ్యత. నిజాన్ని నిర్భయంగా రాయకూడదా? పాత్రికేయులపై జరిగే దాడుల పై చిన్న చూపు ఎందుకు. ప్రింట్ మీడియా గానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరైనా నిజాన్ని నిర్భయంగా రాస్తే ఒత్తిడిలకు గురి చేస్తున్న చిన్న చితుకు గల్లీ లీడర్ నుంచి సెలబ్రిటీల వరకు పత్రికేయులపై దాడి చేసిన దృశ్యాలు మనం ఎన్నో చూశాం. దాడి చేసిన వారిపై ఎలాంటి శిక్ష పడుతుంది ఎవరైనా చూసామా? దేశానికి నాలుగో స్తంభమైన మీడియా రంగాన్ని చాలా మటుకు దాడులతో ఆపేస్తున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే పూర్తి పాత్రికేయులను అందరిలా పోల్చడం సరికాదు. ప్రభుత్వ ఉద్యోగుల పై దాడి చేస్తే ఎలాంటి రక్షణ ఉందో. పాత్రికేయులపై కూడా దాడి చేస్తే అలాంటి పూర్తిస్థాయి రక్షణ చట్టం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్క పాత్రికేయుల తరుపున కోరుతున్న ఒక పాత్రికేయుడు.