ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రగతి వైపు అడుగులు​ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సాక్షి డిజిటల్ న్యూస్ మే 04 సూర్యాపేట ప్రతినిధి బాణోతు రామకృష్ణ; కోదాడ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ సమావేశంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.సమావేశంలోని ముఖ్యాంశాలు ప్రజా సంక్షేమమే లక్ష్యం శానిటేషన్, త్రాగునీరు, విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు సంక్షేమ పథకాలు గృహ జ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్), ఇందిరమ్మ ఇళ్లు, ₹500 గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాల అమలు తీరుపై సమీక్షించారు రోడ్డు భద్రత ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల పెంపు, కోదాడ ఏరియా హాస్పిటల్ అప్‌గ్రేడేషన్ పనుల పురోగతి. యువతకు ప్రోత్సాహం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు మెమొంటోల ప్రదానం.​”అభివృద్ధి ఫైళ్లను పెండింగ్‌లో పెట్టకుండా, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *