సాక్షి డిజిటల్ న్యూస్: 04 మే, పాల్వంచ. రిపోర్టర్ కె.జానకిరామ్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సోదర సోదరీమణులకు పత్రికా స్వేచ్ఛ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సత్యాన్వేషణ, సమాజహితానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ఒక పేర్కొన్నారు. నిబద్ధత, ధైర్యం, బాధ్యతతో పనిచేసే పాత్రికేయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల గొంతుకగా నిలిచి, సమాజ పురోగతికి తోడ్పడుతున్న పత్రికా రంగానికి ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.