వేసవి క్రీడ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సాక్షి డిజిటల్ న్యూస్ 4-5-2026.గ్రామం-మస్కాపూర్, మండలం- ఖానాపూర్ జిల్లా- నిర్మల్. రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్: నిర్మల్ ఖానాపూర్ పట్టణంలోని మస్కాపూర్ గ్రామంలో జరిగిన వేసవి శిబిరం సమావేశంలో యువకులు ఎండలో తిరగకుండా వేసవి శిబిరం లో పాల్గొని తన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని మస్కాపూర్ సర్పంచ్ దోనికేని లక్ష్మీ దయానంద్ అన్నారు. శుక్రవారం మస్కాపూర్ లో ప్రభుత్వ వేసవి క్రీడా శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడలు వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీర ఎదుగుదలకు దోహదపడతాయని, ప్రతి క్రీడాకారుడు తనకు నచ్చిన ఆటలు పాల్గొనాలని తమ జీవనశైలిలో ఒక గంట వ్యాయామం కు కేటాయించాలని తెలిపారు. టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ , సహా అన్ని ఆటల్లో పాల్గొని పిల్లలు లబ్ది పొందాలని కోరారు. అనంతరం శిబిరాన్ని ప్రారంభించి కొన్ని ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో యస్ జి ఎప్ జిల్లా కార్యదర్శి రవీందర్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు షేక్ ఇమ్రాన్,టీచర్లు వెన్నం అంజయ్య, ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *