సాక్షిడిజిటల్ న్యూస్, మే 04, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోనే మొట్టమొదటి సారిగా ఉస్మానియా టెక్నాలజీ ఫార్మసీ విభాగంలో పీహెచ్ డీ లింగంపల్లి (అలియాస్ ఆదిముల్క) సంధ్యను మాదిగ యువజన సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇట్టి సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతు అత్యంత కష్టతరమైన ఫార్మసీ విభాగంలో కిష్టమైన అంశంపై పి హెచ్ డి చేయడం కోసం ఆమె పడ్డ కష్టానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహానికి ఇన్నాళ్ళకు అరుదైన గౌరవం దక్కిందని న్యాయవాది అయిన లింగంపెల్లి సురేష్ భార్య అయినా సంధ్య ను వివాహం చేసుకున్న తరువాత పి హెచ్ డి వరకు చదివించి మహిళా సాధికారత ఆలోచన విధానంతో ముందు సాగడం అభినందనీయం అని అన్నారు. ఇట్టి సందర్భంగా డాక్టర్ సంధ్య మాట్లాడుతూ పేద మధ్య తరగతి కుటుంబాలలో మహిళలకు ఉన్నత విద్యా అవసరమైనప్పటికి సాధ్యం కావడం లేదని చదుకోవాలనే ఆశ ఉన్న ఇంటి పరిమితమైన అనేక మంది గృహిణి లు వారి కుటుంబ సభ్యులు చదివిపించుటకు ముందుకు రావాలని కోరారు. అనేక ఆర్థిక సామాజిక కష్టాలు వచ్చిన నా కుటుంబాలు నాకు వెన్నుదన్నుగా ఉండి డాక్టర్ రేట్ వరకు నడిపించారని ముఖ్యంగా మా అత్తమామలు సైతం సహరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు లింగంపల్లి సుభాష్,ఉపాధ్యక్షులు మారంపల్లి లక్ష్మీ నర్సయ్య , దొనకంటి రాజేంధర్, లింగంపల్లి రాజేష్,అగ్గిమల్ల హన్మండ్లు,లింగంపల్లి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.