సాక్షి డిజిటల్ న్యూస్: మే 04: హుజరాబాద్ కాన్స్టెన్సీ ఇన్చార్జి దాసరి రవి: హుజురాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్టు ఎనర్జీ ప్రాజెక్టును వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ గత నెల రోజులకు పైగా నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రద్దు కొరకు నిరసన కార్యక్రమాన్ని చందుపట్ల జనార్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.అనంతరం పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేస్ట్ టు ఎనర్జీ డంపింగ్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన చెత్త నుండి వెలువడు రసాయనాలు భూమిలో ఇంకిపోవడం మూలంగా ఎలాంటి పంటలు పండక పోవడమే కాకుండా నీరు భూమిలో కలుషితమవుతుందన్నారు. వేస్ట్ టు ఎనర్జీలో భాగంగా ఎనర్జీని ఉత్పత్తి చేయుటకు చెత్త పదార్థములను కాల్చడం వలన వచ్చేటువంటి డయాక్సిన్ వంటి విషవాయువులు గాలిలో కలుషితమై ఫలితంగా ప్రజలు లంగ్స్, క్యాన్సర్ తో పాటు మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలకులోను అవ్వడమే కాకుండా దగ్గు,జలుబు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని తమ ఆందోళనను వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఏ మాత్రం ఏమరు పాటు లేకుండా తొందరగా మేల్కొని ముందుకు కదిలి ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వేస్టు ఎనర్జీ ప్రాజెక్టు రద్దు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత వారిపై ఉందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేముల యాదగిరి, విడపు రాజు, చిలకమారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, మంచికట్ల మురళి, ఎం.రమేష్,ఈ చంద్రశేఖర్, ఎస్. సత్యనారాయణ, ఎం.బిక్షపతి, ఇ.సాగర్, ఎం. వెంకట్రాజం, ఇ.వెంకటేశ్వర్లు, టి.దేవేందర్ ఎం.విజయ్ ఎం.విజయ్, ఎం. రమేష్, టి.సంపత్ కుమార్, ఎం. వెంకటేశ్వర్లు, కె.ప్రభాకర్, కె.రామచంద్రం, జేఏసీ నాయకులు గుడిపాటి జయపాల్ రెడ్డి, వి. రత్నం, సందెల వెంకన్న, మార్ట రవీందర్, వెంకట్రావు, టి. హనుమంతరావు, రాజేశ్వరరావు తదితరులతో పాటు చేనేత కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.