సాక్షి డిజిటల్ న్యూస్ ఆనందపురం రిపోర్టర్ భాగం స్వాతి సుధాకర్ మే 04: ఆనందపురం మండలం శొంఠ్యం జాతీయ రహదారి పై శనివారం నాడు రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాలలో ఒకరు మృతి చెందడం జరిగింది. అతివేగం కారణంగా మధ్యాహ్నం సమయంలో అనకాపల్లి నుండి ఆనందపురం వైపు జాతీయ రహదారిపై వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పై ఉన్న ఐరన్ వలయం దాటుకుని సర్వీస్ రోడ్లోకి రావడం జరిగింది.ఈ ప్రమాదంలో కారులో డ్రైవర్ ఒకరు ఉండడంతో ఎవరికి ప్రాణహని లేకపోవడం సర్వీస్ రోడ్లో ఆ సమయంలో ఎటువంటి వాహనాలు కూడా సంచారం లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే జాతీయ రహదారిపై నాలుగు గంటల సమయంలో విజయవాడ నుండి విజయనగరం వెళ్తున్న ద్విచక్ర వాహదారుడు అనకాపల్లి నుండి విజయనగరం వెళ్తున్న లారీకు వెనక భాగాన అతివేగంగా వచ్చి ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా గొర్ల మండలం పల్లి గంట్రేడు గ్రామానికి చెందిన డి.ఈశ్వరరావు గా గుర్తించడం జరిగింది. రెండు ప్రమాదాలలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు తన బృందం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ దుర్ఘటనపై సి ఐ వాసునాయుడు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు సమాచారం.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.