ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం

* జిల్లా యస్.పి కె.నరసింహ ఐ.పి.యస్.

సాక్షి డిజిటల్ న్యూస్ మే 04 సూర్యాపేట ప్రతినిధి బాణోతు రామకృష్ణ: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర, సోదరీమణులకు జిల్లా యస్.పి నరసింహ ఐ.పి.యస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, సత్యాన్వేషణ, సమాజహితానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని ఒక సందేశంలో పేర్కొన్నారు. నిబద్ధత, ధైర్యం, బాధ్యతతో పనిచేసే పాత్రికేయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అన్నారు. ప్రజల గొంతుకగా నిలిచి, సమాజ పురోగతికి తోడ్పడుతున్న పత్రికా రంగానికి ఐ.పి.యస్ జిల్లా యస్.పి నరసింహ అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *