కుత్బుల్లాపూర్ 22-ఏ భూ సమస్యపై ఆగజ్రహించిన వీరారెడ్డి నరేందర్ రెడ్డి.

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గౌడ్ సెప్టెంబర్ 3 కుత్బుల్లాపూర్ షాపూర్‌నగర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని భూములను కాంగ్రెస్ ప్రభుత్వం 22-A నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై షాపూర్‌నగర్‌లోని ఎం.జే. గార్డెన్స్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీడిమెట్ల 132వ డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరారెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు , ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద్ గౌడ్, బిఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి. తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీలకు చెందిన 22-ఏ బాధితులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 7లోపు భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి సమస్యను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 22-ఏ బాధితులతో కలిసి అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తమ గళాన్ని బలంగా వినిపిస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *