కౌతాళం నూతన ఆర్య వైశ్య మండల అధ్యక్షుడుగా చల్లా శ్రీనివాస్ శెట్టి ప్రమాణ స్వీకారం

మహిళా సంఘం అధ్యక్షురాలిగా చల్లా జయశ్రీ ప్రమాణ స్వీకారం
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 కౌతాళం మండలం కర్నూల్ జిల్లా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ టీజీ వెంకటేష్ గుప్తా ప్రధాన అతిధులుగా ఆంధ్రప్రదేశ్ మహాసభలో ఉపాధ్యక్షుడు విట్టా రమేష్ ఉరుకుంద ట్రస్ట్ బోర్డు చైర్మన్ డిజి పాండురంగ శెట్టి కర్నూలు ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడు బిలేహాలు భాస్కర్ శెట్టి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా సభ్యులు స్థానికం కౌతాళం మండలంలోని ఉరుకుంద దేవస్థానం ఎస్ యు వి కళ్యాణ మండపం నందు 02.09.2026 నూతన ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ గుప్తా పాల్గొన్నారు. అనంతరం టీజీ వెంకటేష్ నూతన అధ్యక్షునిగా చల్ల శ్రీనివాస్ శెట్టి ను మహిళా ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షురాలుగా చల్లా జయశ్రీ ను ప్రకటించడం జరిగింది. అనంతరం ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్ శెట్టి, కోశాధికారిగా చల్ల వెంకటేష్ శెట్టి, గౌరవ అధ్యక్షులుగా రాఘవేంద్ర శెట్టి, మీడియా ప్రతినిధిగా చిగిలి మంజునాథ్ గుప్త, జాయింట్ సెక్రెటరీగా చల్ల వినయ్ కుమార్, ఉపాధ్యక్షులను కార్యవర్గ సభ్యులను, సహాయ కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలిగా చెల్లా జయశ్రీ, ప్రధాన కార్యదర్శిగా బి కళావతి, కోశాధికారిగా చల్ల ఉషారాణి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్యవైశ్య సంఘంలో సభ్యులకు ఎటువంటి కష్టమొచ్చిన మీ సోదరుడిగా సహాయం చేయడానికి ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆర్యవైశ్య సభ్యులు ఎటువంటి మనస్పర్ధలు ఉన్న కూర్చుని మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని అందరూ ఐక్యతగా కలిసి మెలిసి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు బి భాస్కర్ శెట్టి, జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రంధి వెంకటగిరి, జిల్లా కోశాధికారి ప్రతాప్ రంగయ్య శెట్టి జిల్లా యువజన అధ్యక్షుడు రవీంద్రబాబు, కౌతాళం ఆర్యవైశ్య సంఘం పెద్దలు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *