
సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 పాలేరు రిపోర్టర్ పి వెంకన్న. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ద్వారా రైతులకు నూతన సాంకేతిక విధానాలపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జూపెడ గ్రామ సర్పంచి వనవాసం నరేందర్ రెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం వైరా కోఆర్డినేటర్ శాస్త్రవేత్త జి పావని మరియు మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారామరెడ్డి గోద్రెజ్ కంపెనీ పామాయిల్ శాస్త్రవేత్త కాశీరాం ఏఈఓ సాధన మరియు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కె వి కె శాస్త్రవేత్త పావని మాట్లాడుతూ రైతులు నూతన సాంకేతిక విధానాలను అవలంబించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించి ఎక్కువ లాభాలు పొందాలన్నారు రైతులు యూరియాతోపాటు నానో యూరియా మరియు నానో డిఏపి పిచికారి చేసి దిగుబడులు పెంచుకోవచ్చు అన్నారు గోద్రెజ్ శాస్త్రవేత్త కాశీ రావు మాట్లాడుతూ పామాయిల్ వేసుకున్నట్లయితే సుమారు లక్ష వరకు ఆదాయం పొందవచ్చు అన్నారు. అదేవిధంగా పామాయిల్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు మండల వ్యవసాయ అధికారి నారెడ్డి సీతారామరెడ్డి మాట్లాడుతూ రైతులు ఏడు రకాల వరి వేసిన వాళ్ళు తప్పనిసరిగా ఆన్లైన్ చేయించుకోవాలని కోరారు మరియు డిజిటల్ క్రాప్ సర్వే వాలంటీర్లను కలిసి తమ సర్వే నెంబర్ల వారి పంటలను నమోదు చేయించుకోవాలన్నారు భవిష్యత్తులో జరిగే కొనుగోలులో డిజిటల్ సర్వే నే పరిగణలోకి తీసుకుంటారన్నారు ఎరువుల యాప్ ద్వారా బుక్కు చేసుకోలేని రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులను సొసైటీ అధికారులను కలిసి బుక్ చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.