ప్రభుత్వ వైఫల్యాన్ని బి ఆర్ ఎస్ బి ఆర్ టి యు కార్డులతో ధర్నా

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ మంచిర్యాల జిల్లా బ్యూరో ఎండి యూసుఫ్ సెప్టెంబర్ 3 మంచిర్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు బిఆర్ఎస్ నాయకులు వినీత్ రావు బి ఆర్ టి యు మంచిర్యాల్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హబీబ్ పాషా మంచిర్యాల జిల్లా కేంద్రం బెల్లంపల్లి చౌరస్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ కార్యదర్శి మరియు ఆటో వివాదం వేముల మారన్న ఆదేశాల మేరకు టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల్ నియోజకవర్గమాజీ శాసనసభ్యులు దివాకర్ రావు మరియు టిఆర్ఎస్ నాయకులు వినీత్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆటో విభాగం తరపున బి ఆర్ టి యు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు హమ్మద్ హబీబ్ పాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ప్రజలకి మహిళలకి విద్యార్థులకు రైతులకు ముఖ్యంగా ఆటో కార్మికు తీరని అన్యాయం చేశారని మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు తో వారి జీవనాదా రమైన ఆటోను మునుగోడ లేకుండా చేశారని మొన్నటికి మొన్న 23వ తారీకు అర్ధరాత్రి జరగనున్న సమ్మెను రద్దు చేయమని రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ నమ్మబలికి సమ్మె విరమింపజేసి ఒకటో తారీకు చర్చలకు పిలుస్తామని ఈరోజు రెండు తారీకైనా ఇప్పటివరకు కార్మిక సంఘ నాయకులను చర్చకు పిలవలేదని ఒకవేళ జరగబోయే శాసనసభ సమావేశాల్లో సంక్షేమ బోర్డు బిల్లు మరియు ఆటో కార్మికులకు ఇప్పటివరకు బాకీ ఉన్న 36వేల రూపాయలు వెంటనే మంజూరు చేయకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర ఆటో కార్మికుల కూడా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ గద్దతింపే పనిలో కూడా ఆటో కార్మికులు చేస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జిల్లా నాయకులు పట్టణ నాయకులు మా తోటి ఆటో కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *