
సాక్షి డిజిటల్ న్యూస్ భీమిలి రిపోర్టర్ (బోయి అప్పల రెడ్డి) సెప్టెంబర్ 3: మంచిమనసున్న మారాజు పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడు పేదవారందరికీ కూడా ఉచిత ఇల్లు అందించిన ఆపద్బాంధవుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలుగు రాష్ట్రాలను తెలుగు ప్రజలను ఒకే తాటిపై నడిపించి మనమందరం ఒకటే అని ఆంధ్ర రాష్ట్రంగా ఉంచి అభివృద్ధి చేసిన ధైర్య సాలి ఆయన మరణంత్రం మన తెలుగు రాష్ట్రం రెండుగా ఎలా మొక్కలైందో మనందరికీ తెలుసు అటువంటి గొప్ప నాయకుడు శ్రీ.వై.యస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భీమిలి జీవీఎంసీ 3వ వార్డు అధ్యక్షులు అల్లిపిల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో భీమిలి పెద్ద బజారు, చిన్న బజారు, తోట వీధి వద్ద ఉన్నటువంటి కీ”శే”లు శ్రీ.వై.యస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకి పూలమాలలతో ఘన నివాళులు అర్పించి వైయస్సార్ అమర్ రహే వైయస్సార్ జిందాబాద్ అంటూ నినాదాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్నటువంటి పేషెంట్లకు పండ్లు, రొట్టెలు వైయస్ఆర్సీపీ 3వ వార్డు నాయకులు మరియు హాస్పటల్ సిబ్బంది ఆధ్వర్యంలో పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో 3వ వార్డు వైఎస్ఆర్సిపి సచివాలయం అధ్యక్షులు కదిరి ఎల్లాజీ, ప్రధాన కార్యదర్శులు వాసుపల్లి కొండబాబు, పిన్నింటి ఎర్రయ్య రెడ్డి, వాడమొదుల జగ్గారావు, ఉపాధ్యక్షులు కొండ్రు రామసూరప్పడు, బూర నాగరాజు, మాజీ కౌన్సిలర్ మైలపల్లి లక్ష్మణరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు అనపర్తి సూర్యప్రకాశరావు, వార్డ్ బూత్ కన్వీనర్ పాసి వినోద్ కుమార్, ప్రచార విభాగం అధ్యక్షులు పీతల శంకర్రావు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అప్పికొండ బాలకృష్ణ నాయకులు గుండాసు మధు నాయుడు, బాకీ రమణారెడ్డి, కుంకుపూడి ఎర్రి బాబు, వాసుపల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.