వై ఎస్ ఆర్ 17వ వర్ధంతి వేడుకలు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 దివంగత నేత మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి చీడిగుమ్మలలో మండల పార్టీ అధ్యక్షులు పాణి సాంతరం జడ్పీటీసీ ఎస్ వెంకట గిరిబాబు పరివేక్షణలో ఘనంగా నిర్వహించారు. అనంతరం నర్సీపట్నం నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షులు కొల్లు సత్యనారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు అయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చీడిగుమ్మలా పీహెచ్ సి లో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *