
సాక్షి డిజిటల్ న్యూస్ / సెప్టెంబర్ 03 అడ్డగూడూర్ రిపోర్టర్ నోముల ఉపేందర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాడని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108,ఫీజు రియంబర్స్మెంట్ , రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత కరెంటు,ఒక రూపాయి కిలో బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు,పేదలకు భూ పంపిణీ, మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇలా అనేక సంక్షేమ పథకాలకు ప్రాణం పోసిన మహానీయుడు దివంగత వైయస్సార్ అని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెయ్యి రోజులలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 కే ఎల్ పి జి సిలిండర్ సరఫరా, గృహ జ్యోతి, ఉచిత సన్న బియ్యం లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసిన పనిని ఈ రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా వృధాగా లక్షల జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. తక్షణమే కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారే తప్ప అభివృద్ధి ఏ మాత్రం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మనగోటి జోజి, పాశం సత్యనారాయణ, వల్లంభట్ల రవీందర్, చిర్ర గూడూరు, కంచన పళ్లి, రాపాక (డి )సర్పంచులు సోమనారాయణ, అంబేద్కర్, శ్రీకాంత్, నాయకులు చిత్తలూరు సోమన్న, బొమ్మగాని లక్ష్మయ్య,పూలపల్లి సోమిరెడ్డి,కడారి రమేష్, గూడెపు పాండు, మారిశెట్టి మల్లేష్, మందుల వెంకటేష్,చెడే మహేందర్, బైరెడ్డి సందీప్ రెడ్డి,పూలపల్లి రాజశేఖర్ రెడ్డి,లింగమల్లు, నాగరాజు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.