
సాక్షి డిజిటల్ న్యూస్ ఆలూరు నియోజకవర్గం రిపోర్టర్ 03/09/2026 దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలో ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ విగ్రహానికి హంద్రీనీవా జలాలతో జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి , మాజీ ఎంపీ బుట్టా రేణుక మరియు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సెక్రటరీ సిట్రా సత్యనారాయణమ్మ కలిసి జలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కర్నూల్ జిల్లా కోర్టు వద్ద శాశ్వత హైకోర్టు బెంచ్ సాధన కోసం 10 రోజులుగా న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. ఈరోజు మహిళా న్యాయవాదుల రిలే దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర సెక్రటరీ సిట్రా సత్యనారాయణమ్మ ఒక మహిళా న్యాయవాదిగా దీక్షలో కూర్చుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిట్రా సత్యనారాయణమ్మ మాట్లాడుతూ. “వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని హంద్రీనీవా తీసుకొచ్చారు. నేడు ఆయన విగ్రహానికి అదే హంద్రీనీవా నీటితో అభిషేకం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే రాయలసీమ ఆత్మగౌరవం కోసం, కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని 10 రోజులుగా న్యాయవాదులు చేస్తున్న పోరాటం న్యాయమైనది.. ఒక న్యాయవాదిగా, వైఎస్ఆర్సీపీ నాయకురాలిగా నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి , కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి , మాజీ ఎంపీ బుట్టా రేణుక , బీవై రామయ్య , వైస్సార్సీపీ రాష్ట్ర మాధసి /మాధారి కురువ సంఘం అధ్యక్షులు గడ్డం రామకృష్ణ పాల్గొన్నారు.