గంటల్లోనే హత్యా ప్రయత్నం కేసు లో ముద్దాయి ని పట్టుకున్న బీమిలి పోలీసులు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ భీమిలి రిపోర్టర్ (బోయి అప్పల రెడ్డి) సెప్టెంబర్ 3 తేది. 02-09-2026 దిన రాత్రి సమయం లో భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న చిట్టీల అగ్రహారం గ్రామ శివారులో ఉన్న ఖాళీ స్థలం లో ఆనందపురం మండలం, పెద్దిపాలెం గ్రామానికి చెందిన సుమారు 25 మంది కుర్రాళ్ళు బ్యాచిలర్ పార్టీ చేసుకుంటుండగా, ఈ పార్టీ లో మద్యం మత్తులో ఉన్న మదాస్ నిఖిల్, ఎర్రంశెట్టి మదన్ కుమార్ మద్య వాగ్వాదం చోటుచేసుకోనగా, ఇరువురు ఘర్షణపడినారు. ఈ ఘర్షణ లో, ఎర్రంశెట్టి మదన్ కుమార్ ఆ పక్కనే ఉన్న ఖాళీ మద్యం బాటిల్ తీసి పగలుకొట్టి, మదాస్ నిఖిల్ పై దాడి చేయగా, ఈ దాడిలో నిఖిల్ కి తన శరీరం పై పలు చోట్ల గాయాలు అయినాయి. అతను ప్రస్తుతం ఎన్.ఆర్.ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పై భీమిలి పోలీస్ స్టేషన్ వారు ఎర్రంశెట్టి మదన్ కుమార్ హత్యాయత్నం కేసు నమోదు చేసి, 24 గంటల్లోనే ముద్దాయిని అదుపులోనికి తీసుకొని, రిమాండ్ కి తరలించడమైనది. మరియు సదరు ముద్దాయి పై రౌడీ షీట్ తెరవడానికి ప్రపోసల్స్ పెట్టడమైనది. బీమిలి మండలంలో ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరిగిన తీవ్ర చర్యలు తీసుకుంటాం అని బీమిలి సీఐ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *