పులివెందులలో ఘనంగా డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్, పులివెందుల, సెప్టెంబర్ :03(పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసుల అంజనేయులు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులుపవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పులివెందులలోజనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాలు జనసేన పార్టీ పులివెందుల ఇంచార్జ్ డాక్టర్. హరీష్ ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగాయి. జన్మదిన వేడుకల సందర్భంగా వేంపల్లి నుండి పులివెందుల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జనసేన పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరియు పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. తదుపరి భారీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లికార్జున, సింహాద్రిపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జ్యోతి,హితేష్ రాయల్, దేవా, సుధీరెడ్డి, గోసుల అంజనేయులు, రౌతు నాగేంద్ర, మల్లేష్, దాసరి నారాయణ స్వామి, అశోక్, లక్ష్మణ్, జయచంద్ర, పట్టే ఉదయ్, ముక్తార్, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.జనసేన శ్రేణుల నినాదాలతో పులివెందుల ప్రాంతం మారుమోగింది.పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన బైక్ ర్యాలీ, కేక్ కటింగ్ కార్యక్రమాలు ప్రజల్లో మరియు జనసేన అభిమానుల్లో విశేష ఉత్సాహాన్ని నింపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *