నేనే రాజు నేనే మంత్రి నియంత పాలనలో వరిగుంతం గ్రామం

సాక్షి డిజిటల్ న్యూస్ మెదక్ జిల్లా కొల్చారం మండలం, వరిగుంతం రిపోర్టర్ భూమయ్య: మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో గ్రామపంచాయతీ బాడీ మీటింగ్ ఉద్రిక్తంగా మారింది. గ్రామ అభివృద్ధి పనులపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ మోహన్ వ్యవహారశైలి పై వార్డ్ మెంబర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో సర్పంచ్ మోహన్ “నేను ఫస్ట్ టైం గెలిచాను, ప్రతి పని నేనే చేసుకుంటాను. ఏ ఒక్క వార్డ్ మెంబర్‌కు తీర్మానాలు ఇవ్వను” అని వ్యాఖ్యానించినట్లు మెంబర్లు ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వార్డ్ మెంబర్లు, “ప్రజాస్వామ్య విధానాలను పక్కన పెట్టి ఒంటెద్దు పోకడతో వ్యవహరించడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. రెండు మూడు తీర్మానాలు చేసిన ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో ఆయా కాలనీ ప్రజలు వార్డు సభ్యులను పదే పదే నిలదీయడంతో గెలిచిన వార్డు సభ్యులు సమాధానం చెప్పలేకపోతున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత నెల రోజులుగా బోరు మోటర్ నుండి వాటర్ ట్యాంక్ కు మధ్యలో పైప్ లైన్ పగిలిపోవడంతో వేసవిలో నీరు వృధాగా పోవడంతో కలుషితమైన నీరు తాగునీటి అవసరాలకు వాడుతున్నామని కాలనీ ప్రజలు చెప్పారు ఎన్నిసార్లు చెప్పినా సర్పంచ్ పట్టించుకోవట్లేదని చెప్పారు ఇక నూతనంగా పెట్టించిన వీధిలైట్లు సైతం పట్ట పగలు కూడా వెలుగుతున్నాయి వాటి నిర్వహణ లోపాలు సరిదిద్దలేకపోతున్నారు. గతం లో మిషన్ భగీరథ పనులు చేయడం తో మోరీ లుపలు వార్డులో స్వల్పంగా ధ్వంసం అయినవి ఆ పనులు కూడా బాగు చేయాలని కోరుకున్నారు. కుడి చెరువు తండాలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ తండా ప్రజలు సర్పంచ్ కు నూతన బోరు వెయ్యమని చెప్పిన తనకు పట్టనట్లు ప్రవర్తిస్తున్నాడు. ఇకా గ్రామంలోకొన్ని సీసీ రోడ్లు, మోరీల, నిర్మాణం చేపట్టాల్సి ఉండగా వాటి పనులలో కూడా జాప్యం చేస్తుండటంతో వార్డు సభ్యులకు ప్రజలకు బేధాభిప్రాయాలు నెలకొన్నాయి. అదే సమయంలో, గ్రామ సెక్రటరీ కూడా సమావేశంలో జరిగిన అంశాలపై స్పందించకపోవడం పట్ల మెంబర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్, సెక్రటరీ ఇద్దరూ కలిసి వార్డ్ మెంబర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని వార్డ్ మెంబర్లు కోరుతున్నారు. గ్రామంలో ప్రజాస్వామ్య పద్ధతులు పాటిస్తూ గ్రామ అభివృద్ధిలో భాగం కావాలని ప్రజలు కోరుకుంటున్నార: నేనే రాజు నేనే మంత్రి నియంత పాలనలో వరిగుంతం గ్రామం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *