రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ కీలక సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్‌కు చెందిన మైనార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ సభ్యుడు మరియు సిరిసిల్ల అబ్జర్వర్ మొహమ్మద్ ఫయాజ్ హాజరై నాయకులకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో పార్టీ బలోపేతానికి మైనార్టీ వర్గాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాహెబ్ హుసేన్ మాట్లాడుతూ, మైనార్టీ వర్గాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో మైనార్టీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్ సహా ఇతర నాయకులు పాల్గొని పార్టీ అభివృద్ధి, సభ్యత్వ విస్తరణ, రాబోయే కార్యక్రమాలపై చర్చించారు. నాయకులు పార్టీ శక్తివంతం కోసం సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *