
సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 2 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ఏజెన్సీ మండలమైన గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయాన్ని వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్} మండల ఇంచార్జ్ భూక్య శ్రీను నాయక్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.గార్ల మండలం మొత్తం పూర్తిగా వర్షాధార నీటిపైనే ఆధారపడి ఒక్క పంట మాత్రమే పండే భూములు ఉన్నాయని ఈ సంవత్సరం ఎల్ నీనో వాతావరణ ప్రభావంతో అతి తక్కువ వర్షపాతం నమోదయిందని ఆవేదన వ్యక్తం చేశారు.అక్కడక్కడ నామమాత్రంగా వరి పంటలు వేశారని అవి కూడా చివరి దశకు వస్తున్నప్పటికీ నీరు లేక ఎండిపోతున్నాయని,పత్తి,మిర్చి పంటలు పండటం ప్రశ్నార్థకంగా మారడంతో పేద, మధ్యతరగతి కి చెందిన రైతులు ముఖ్యంగా గిరిజన రైతులలో ఆందోళన నెలకొందన్నారు.ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో కేవలం ఏడు మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం అందులో ఏజెన్సీ మండలమైన గార్ల మండలం లేకపోవడం శోషనీయం అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.