చోరీ బాధిత కుటుంబానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆర్థిక సాయం

నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో గంగాధర్ కుటుంబానికి పరామర్శ.. అండగా ఉంటామని భరోసా
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ జగిత్యాల నియోజకవర్గం ఇన్‌చార్జ్: కొడిపెల్లి సురేష్/ జగిత్యాల, నవంబర్ 2 జగిత్యాల పట్టణంలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో దొంగతనం బాధిత కుటుంబానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి అండగా నిలిచారు. తెలంగాణ భవన్‌లో పనిచేస్తున్న గంగాధర్ ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగిన విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసి దొంగతనం ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ, వారికి మనోధైర్యం కల్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *