కమ్యూనిస్టులు మరణించిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు

* సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు. * పల్లివాడ గ్రామంలో సిపిఎం నాయకుడు బైక్అని నరసింహ స్థూపావిష్కరణ సంతాప సభ. * బహిరంగ సభకు భారీగా హాజరైన జనం. * అలరించిన ప్రజానాట్యమండలి బహుజన కళారూపం.

సాక్షి డిజిటల్ న్యూస్, 4 మే 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: కమ్యూనిస్టులు మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. పల్లివాడ సిపిఎం సీనియర్ నాయకుడు బైకాని నరసింహ స్మారక స్తూపావిష్కరణ, సంతాప సభ గ్రామపంచాయతీ సెంటర్లో నిర్వహించడం జరిగింది. గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి అనంతరం జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరైన చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం పోరాటాలు నిర్వహించి సమాజ అభ్యున్నతి కోరుకున్న కమ్యూనిస్టులను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని అన్నారు. బైకాని నరసింహ చిన్నతనం నుండి ఉన్నత భావాలతో సిపిఎం చేసే ప్రజా పోరాటాల్లో మమేకమవుతూ గ్రామ ప్రజల మనసులో చెదరని ముద్ర వేసుకున్నారని తన మరణం పార్టీకి, ప్రజా ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలపై పెను భారాలు మోపుతూ రోజు రోజుకు ధరలు పెంచుతున్నాయని సామాన్య పేదలు జీవించే పరిస్థితి లేదని అన్నారు. ఎన్నికలను పెట్టుబడిగా మార్చుకొని డబ్బున్నవారే రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగి ప్రజాస్వామిక వ్యవస్థని అపహాస్యం చేస్తున్నారని. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయి పేదరికానికి సూచికగా మారుతుందని. ప్రజా వ్యతిరేక విధానాలపై బైకాన్ని నరసింహ సిపిఎం చేసే ప్రజా పోరాటాల్లో మమేకమవుతూ సమ సమాజం నిర్మాణం కావాలని కోరుకున్నారు ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే బైకాని నరసింహకు మనమిచ్చే ఘన నివ్వాలి అని అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి జహంగీర్ అనేకమంది పేదలకు నాణ్యమైన వైద్యం అందక వైద్య చికిత్సలు చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రాణాలు వదులుతున్నారని పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం డి జహంగీర్ అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన సిపిఎం నాయకుడు బైకాని నర్సింహా మెరుగైన వైద్యం చేయించుకోలేక సకాలంలో నాణ్యమైన వైద్యం అందక మరణించడం జరిగిందని ఇలా అనేకమంది మరణిస్తున్నారని ప్రభుత్వాలు దీనిపై చొరవ చూపాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తే పేదలకు ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. అలరించిన ప్రజానాట్యమండలి బహుజనకళారూపం గోసంగి వేషం సిపిఎం నాయకుడు బై కానీ నరసింహ సంతాప సభ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు బహుజన కళారూపం గోసంగి వేషంతో అలరించడం జరిగింది. సమాజంలో ఉన్న కుల వ్యవస్థ అంటరానితనంపై అందర్నీ ఆలోచించే విధంగారచయిత బండి సత్తన్న రాసిన కళా రూపాన్ని గడ్డం పాండురంగం జామాబావంతుడు వేషాధారణలో ప్రదర్శించడం జరిగింది. ప్రజానాట్యమండలి కళాకారులు అమరవీరుల గీతాలాపనతో ఆటపాట తో ధూమ్ ధామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, గ్రామ సర్పంచ్, బిఆర్ఎస్ నాయకులు కంబంపాటి శ్రీనివాస్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ కల్లూరి నగేష్, గ్రామ శాఖ కార్యదర్శి, ఉప సర్పంచ్ పావిరాల మత్యగిరి,జిల్లా కమిటి సభ్యులు బల్గురి అంజయ్య, వనం ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు జంపాల అండాలు, కందుల హనుమతు, సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు గొరిగే సోములు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంటెపాక శివ కుమార్, ఈర్లపల్లి ముత్యాలు నాయకులు తోలుపునూరి శ్రీనివాస్, వేముల సైదులు, గ్రామ నాయకులు జనపాల లక్ష్మణ్, దండిగ నర్సింహా, గట్టు ఉపేందర్, కుటుంబ సభ్యులు బైకాని నర్మద, గణేష్, అప్పం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *