సేవ సాంకేతికత సత్యానికి ప్రతీక

* ప్రెస్ ఫ్రీడమ్ డే ప్రత్యేకం ఇండిపెండెంట్ జర్నలిస్ట్. * చిర్రా శ్రీనివాస్ గౌడ్.

సాక్షి డిజిటల్ న్యూస్ మే 4 మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభంగా నిలిచే మీడియా రంగంలో నిబద్ధత, నిజాయితీ, ధైర్యం అత్యంత ముఖ్యమైన విలువలు. ఈ విలువలను తన జీవితాంతం ఆచరిస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చిర్రా శ్రీనివాస్ గౌడ్. 1981 నుండి 1991 వరకు శ్రీ సీతారామ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన, అనంతరం 1991-1993 ఖమ్మం లోని ప్రసిద్ధ ప్రజ్ఞ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు. ఆ కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రముఖ జూనియర్ కళాశాలగా గుర్తింపు పొందిన ఈ విద్యాసంస్థలో చదువుకోవడం ఆయన విద్యాభ్యాసానికి బలమైన పునాది అయింది. తరువాత1993-1996 కొత్తగూడెంలోని శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసి, సాంకేతిక రంగంలో తన ప్రావీణ్యాన్ని పెంపొందించుకున్నారు. సాంకేతిక రంగంలో ముందుచూపుతో మణుగూరు మండలంలోని పైలెట్ కాలనీ రోడ్డులో “క్రియేటివ్ కంప్యూటర్స్” అనే సంస్థను స్థాపించిన చిర్రా శ్రీనివాస్ గౌడ్, సుమారు 25 సంవత్సరాల క్రితమే కంప్యూటర్ విద్య ప్రాముఖ్యతను గుర్తించి “క్రియేటివ్” అనే పేరుతో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించడం విశేషం. ఈ సంస్థ ద్వారా వందలాది మంది విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించి, ఉద్యోగావకాశాలు కల్పించి, వారు స్వయం ఉపాధి పొందేలా మార్గనిర్దేశం చేశారు. మండలంలో మొట్టమొదటి హార్డ్వేర్ ఇంజనీర్‌గా గుర్తింపు పొందిన ఆయన, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులకు కంప్యూటర్ హార్డ్వేర్ సేవలు అందిస్తూ విశేష సేవలందించారు. 1996లో “గౌతమీ విజ్ఞాన విషయ బులెటిన్” అనే మాస పత్రికను ప్రారంభించి, సీనియర్ జర్నలిస్టుల సలహాలతో, అప్పటి డీఎస్పీ జీవన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆయనలోని సృజనాత్మకతకు నిదర్శనం. 1997లో ప్రజాతంత్ర వార పత్రికలో పనిచేసిన అనుభవం ఆయన జర్నలిజం ప్రస్థానానికి బలమైన ఆరంభం అయింది. తరువాత ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అడుగుపెట్టి, ప్రముఖ వార్తా ఛానెల్స్ అయిన ఐ న్యూస్ ఛానల్ మరియు 10టీవీ ఛానల్ లో పని చేసి మంచి గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువచ్చే ధైర్యంతో ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. జర్నలిస్టుల హక్కుల కోసం కూడా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ట్వజేఫ్ ) లో 2010లో సభ్యుడిగా చేరి, జిల్లా కార్యదర్శిగా, జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలో గుర్తింపు పొందిన ప్రముఖ జర్నలిస్టు సంఘంగా పేరొందిన ఈ ఫెడరేషన్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారు. జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌లలో పాల్గొంటూ, తన ప్రాంత జర్నలిస్టుల సమస్యలను పలు వేదికలపై గళమెత్తి వినిపించారు. తన సంఘం ద్వారా జర్నలిస్టులకు అండగా నిలుస్తూ, వారికి అవసరమైన సహాయం అందించారు. ప్రస్తుతం మణుగూరు మండలంలోని పైలెట్ కాలనీ రోడ్డులో క్రియేటివ్ కంప్యూటర్ జాబ్ వర్క్స పేరుతో కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తూ, సి ఎస్ సి అకాడమీ అనుమతితో సేవలు అందిస్తున్నారు. ఈ అకాడమీ ద్వారా అనేకమంది అభ్యర్థులకు బ్యాంకింగ్ పరీక్షలు మరియు ఇతర ఆన్‌లైన్ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 50 ప్లస్ వయస్సులో ఉన్నప్పటికీ, కంప్యూటర్ రంగంపై ఉన్న మక్కువను ఏమాత్రం తగ్గించకుండా, ఇంకా విద్యార్థులు మరియు ప్రజలకు సేవ చేయాలనే తపనతో కొనసాగుతున్నారు. పలు పత్రికలు, ప్రముఖ వ్యక్తులకు వెబ్‌సైట్ డిజైన్ చేసి, స్వయంగా నిర్వహించడం ఆయన సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. ప్రస్తుతం ఇండిపెండెంట్ జర్నలిస్టుగా కొనసాగుతున్న చిర్రా శ్రీనివాస్ గౌడ్, ప్రజల గొంతుకగా నిలుస్తూ సమాజానికి సేవ చేస్తున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా తన కర్తవ్యాన్ని వదలకుండా ముందుకు సాగడం ఆయన ప్రత్యేకత. ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా, చిర్రా శ్రీనివాస్ గౌడ్ వంటి జర్నలిస్టులు సమాజానికి స్ఫూర్తి. సాంకేతికతతో సేవ చేయడం, సత్యం కోసం పోరాడడం—ఈ రెండు లక్షణాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.“సాంకేతికతతో సేవ జర్నలిజంతో సత్యం” అనే భావనతో ముందుకు సాగుతున్న చిర్రా శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వక అభినందనలు. కురి రాజేశ్వరరావు పూర్వపు పాత్రికేయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *