
సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 2 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) ఓటర్ల జాబితా సవరణ కసరత్తు (సర్)కు నిరసనగా సిఈసి గణేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆదివారం ఛలో ఢిల్లీ పేరుతో నిర్వహించిన ర్యాలీకి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో అచ్చంపేట కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఢిల్లీలోని మింటో రోడ్-కనాట్ ప్లేస్ కూడలి నుంచి రామ్ లీలా మైదానం వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం రాముడిలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి మహాసభను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము బుచ్చిరాములు మరియు వివిధ హోదా లోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.