సాక్షి డిజిటల్ న్యూస్, 4 మే 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: ఒరిస్సా రాష్ట్రం నుంచి సెంట్రింగ్ పని కోసం రామన్నపేటకు వచ్చిన యువకుడు కాలువలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. రామన్నపేట ఎస్ఐ డి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం. ఫిర్యాది శేహాద్రి కుమార్ అతని బంధువు రాజు ఖిలో (20) ఇద్దరు కలిసి ఒరిస్సా రాష్ట్రం బండిగూడా గ్రామం నుంచి 20 రోజుల క్రితం రామన్నపేటకు సెంట్రింగ్ పని కోసం వచ్చారు. 01.05.2026 తేదీన సెలవు దినం కావడంతో శేహాద్రి కుమార్, రాజు ఖిలో, ఫిర్యాది బాబాయి ముగ్గురూ కలిసి దుబ్బాక మీదుగా లచ్చిరెడ్డిగూడెం శివారులోని అసిప్ నగర్ కాలువ వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో చేపలు పట్టేందుకు కాలువలో దిగగా, రాజు ఖిలో ప్రమాదవశాత్తు బురదలో కూరుకుపోయి మునిగిపోయాడు. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై శేహాద్రి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల సూచన వేసవిలో కాలువలు, చెరువుల్లో లోతు తెలియకుండా దిగవద్దని, ముఖ్యంగా వలస కూలీలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.