సాక్షి డిజిటల్ న్యూస్, ఎల్.బి. నగర్,లింగోజిగూడ డివిజన్. మే 4. రిపోర్టర్: ఎం. దుర్గా ప్రసాద్: లింగోజిగూడ డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు. లింగోజిగూడ ఎక్స్ప్లోర్ లీడర్‌గా, ప్రస్తుత టిపిసిసి అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కుట్టు మిషన్లు వంటి పథకాల ప్రయోజనాలు వారికి అందాయా లేదా అనే విషయాన్ని విచారించారు. ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేరాలని ఆయన సూచించారు. అందని వారికి ప్రజాప్రస్థానంలో ప్రవేశపెట్టి, అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.