సాక్షి డిజిటల్ నిజామాబాద్ జిల్లా మే 4 బోధన్ మండలం: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆర్య సమాజము దయానంద గోశాలలో నిర్వహించిన బాలబాలికల సదాచార శిక్షణ శిబిరం సమాపన సమారోహం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్ గుప్తా గారు మాట్లాడుతూ, “పిల్లల్లో సద్గుణాలు, సంస్కారం పెంపొందించు కోవడం ఎంతో ముఖ్యం. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవాలి. క్రమశిక్షణ, వినయం, ధర్మం అనేవే విజయానికి పునాది” అని ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. శిబిరంలో భాగంగా బాలబాలికలకు కరాటే, యోగా, ప్రాణాయామం, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి వంటి అంశాలలో శిక్షణ అందించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని కరాటే విన్యాసాలు, యోగా ప్రదర్శనలతో తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ ప్రతినిధులు, గురువులు, తల్లిదండ్రులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరం ద్వారా పిల్లల్లో భక్తి భావం, శ్రద్ధ, క్రమశిక్షణ పెంపొందించడంలో ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి రసంతో నిండుగా విజయవంతంగా ముగిసింది.