గ్రీన్ ఎస్‌ఎం కార్లపై ఆటో,క్యాబ్ డ్రైవర్ల ఆగ్రహం.. ఉపాధి భద్రత కోసం సమరభేరి!నవంబర్ 6న ఉప్పల్‌లో టిఆర్ టియు ఆధ్వర్యంలో భారీ ధర్నా.. శ్రీధర్ గౌడ్ పిలుపు!

*నవంబర్ 6న ఉదయం 11 గంటలకు ఉప్పల్ ఎన్‌జీఆర్‌ఐ స్టేడియం సమీపంలో నిరసన!గ్రేటర్ హైదరాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ పిలుపు!
🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 02, 2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ గ్రీన్ ఎస్‌ఎం కార్ల ప్రవేశంతో ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని టి.ఆర్.టి. యు గ్రేటర్ హైదరాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.డ్రైవర్ల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు నవంబర్ 6న ఉప్పల్‌లో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్.జి.ఆర్.ఐ స్టేడియం సమీపంలోని పిల్లర్ నంబర్ సి 927 వద్ద నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు.ఆటో, క్యాబ్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.డ్రైవర్ల హక్కుల పరిరక్షణ, ఉపాధి భద్రత కోసం ఐక్యంగా పోరాడుతామని శ్రీధర్ గౌడ్ స్పష్టం చేశారు.ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వారికి న్యాయం జరిగేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *